ముద్ర,తెలంగాణ:-తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించడంతో ఆమె సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న సోనియాను కలసిని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వ్యక్తిగా సోనియా వస్తే బాగుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఆమెను ప్రత్యేకంగా కలసి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. సోనియాను కలిసిన రేవంత్ రెడ్డి తర్వాత మీడియాతో జూన్ రెండో తేదీన జరిగే వేడుకలకు సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆమె తమ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారని మీడియాకు రేవంత్ రెడ్డి తెలిపారు.