ముద్ర,సెంట్రల్ డెస్క్:-రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు ఆగడం లేదు. మద్యం మత్తు, అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం.. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినతరం చేస్తున్నారు. మారనున్న ట్రాఫిక్ నిబంధనల ప్రకారం నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్ల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అతివేగంతో పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.50 జరిమానా. మైనర్లకు వాహనం నడిపితే రూ.25 వేలు జరిమానా, 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా నిషేధం విధించబడుతుంది.