ముద్ర,తెలంగాణ:-వరంగల్ లో దారుణం జరిగింది. ఒక్క రూపాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన చిల్లర ఘర్షణ, ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. క్షణికావేశంలో మాటామాట పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఓ వ్యక్తి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషాద సంఘటన వరంగల్ మిల్స్ కాలనీ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో జరిగింది.. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి నడుపుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లోని ఓ బిర్యానీ పాయింట్ వద్దకు బిర్యాని కోసం వచ్చాడు. అదే సమయంలో అరవింద్ అనే యువకుడు కూడా బిర్యాని కోసం అక్కడకు వచ్చాడు. ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ 59 రూపాయల బిర్యానికి, 60 రూపాయలు ఫోన్ పే కొట్టాడు. ఈ ఒక్క రూపాయి ఎక్కువ కొట్టావ్ అంటూ అరవింద్ ఆటో డ్రైవర్‌ను ఎగతాళి చేశాడు. ఈ విధంగా మధ్య మాటామాట పెరిగి ఇద్దరి వాగ్వివాదానికి దారి తీసింది.ఇది కాస్త ఇద్దరి మధ్య వివాదంగా మారి అరవింద్, ప్రేమ సాగర్‌ను తొయ్యడంతో ప్రేమ రాయి మీద పడి మెదడులో రక్తం గడ్డ కట్టి చనిపోయాడు