ముద్ర,తెలంగాణ:- సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ కోరాలని బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని. కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణలో సమగ్రత, చిత్తశుద్ధి లోపించినట్లు కన్పిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలంగాణ ప్రతిష్ట మసకబారింది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ప్రత్యేక హక్కులను మంట కలిపారు. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను కూడా కాలరాశారని ప్రాథమిక ఏర్పాటు.
భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు ఫోన్‌లో మాట్లాడుకునే వస్తువులను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడం ద్వారా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. విపక్షాల అణచివేత కోసం ఫోన్ ట్యాపింగ్ ద్వారా సైబర్ దాడికి తెగబడటం సహించరాని విషయం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీడియాకు లీకులివ్వడమే తప్ప అధికారికంగా జరుగుతుందో ఇప్పటి వరకు వెల్లడించకపోవడం చూస్తుంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విచారణపై నెలకొన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. త’మకు అందుతున్న సమాచారం ప్రకారం… రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతోపాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా పూర్తి స్థాయిలో జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసిందని లేఖలో పేర్కొన్నారు.