ముద్ర,సెంట్రల్ డెస్క్:-లండన్ ఎన్ ఆర్ ఐ బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరయ్యారు.లండన్ కార్యక్రమం టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ జగదీష్ రెడ్డి, లండన్ బిఆర్ఎస్ శాఖ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్, అధికార ప్రతినిధులు రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జీ సురేష్ బుడగం, కోశాధికారి సతీష్ గొట్టిముక్కుల, సెక్రటరీ సత్య చిలుముల, బోనగిరి నవీన్, ప్రశాంత్ మామిడాల ఉన్నారు.