ముద్రణ,పానుగల్: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నవీన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందడం పట్ల పానుగల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి ఎంపీ చేత అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.
ప్రజా,రైతు సంక్షేమం బిఆర్‌ఎస్ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల మాజీ కోఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు, సింగిల్ విండో డైరెక్టర్ ప్యాట బాలరాజు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు దశరథ నాయుడు,భాస్కర్ రెడ్డి,రామచందర్ రావు, ధర్మారెడ్డి,బాలవర్దన్,రవి కుమార్ రెడ్డి,నవీన్ రెడ్డి, ఆది హనుమంతు,గోపాల్,తదితరులు ఉంటారు