ముద్ర,తెలంగాణ:- ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో దారుణం జరిగింది. పోలీసులను టార్గెట్ చేస్తూ కొంగాల ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు సోమవారం పేలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. జగన్నాపురం గ్రామానికి చెందిన అయిదుగురు ఇల్లందుల ఏసు (55 ), ఇల్లందుల రమేష్, ఇల్లందుల ఫకీర్, ఇల్లెందుల పాల్గుణ, అరికిల్ల లక్ష్మయ్య క’ట్టెల కోసం కొంగాల నివాసానికి ఉదయం వెళ్లారు.
గుట్ట పైకి వెళ్తున్న సమయంలో దారిలో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఇల్లెందుల ఏసు అక్కడికక్కడే చ’నిపోయాడు. మిగిలిన నలుగురు సేఫ్‌గా ఉన్నారు. ఎలాంటి గాయాలు కాలేదు. ప్రెజర్ బాంబు పేలడంతో శబ్దానికి దూరంగా పరిగెత్తారు. కొంగాల గుట్టపై బాంబు పేలడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇది తెలుసుకున్న బంధువులు సంఘటన గురించి వెళ్లి విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆరా తీస్తున్నారు.