- భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా రెండు లక్షలకు పైగా మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపొందడం హర్షదాయకం
- తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేస్తా
- తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్
తుంగతుర్తి ముద్ర:-భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకు అత్యధిక మెజారిటీ 63 వేల ఓట్లు ఇచ్చిన తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తుంగతుర్తి శాసనసభ్యులు మందు సామెల్ తెలిపారు రుణపడి ఉంటానని అన్నారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలు రెండు లక్షల మందికి పైగా మెజారిటీతో గెలిపించడం హర్షదాయకం అని అన్నారు .తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది కేవలం తనతోనే సాధ్యమని కుంటుబడ్డ విద్యా వైద్య రవాణా రంగాలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లామని అన్నారు . అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తాను కృషి చేశానని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన భారీ మెజార్టీని నియోజకవర్గ ఉద్యమకారులకు అంకితం ఇస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.