ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో ఇవాళ కూడా ఎలక్షన్ కౌంటింగ్ కొనసాగనుంది. ఈ రాష్ట్రంలో ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. వరంగల్- ఉమ్మడి ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ఇంతకు ముందే జరిగాయి. వాటిని ఈరోజు లెక్కపెట్టనునారు మే 27న జరిగిన ఈ ఉప ఎన్నిక పోలింగ్‌లో 72.44 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరిగింది.
మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది.నల్లగొండ దగ్గరలోని దుప్పల్లిలో ఉదయం 8 గంటలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం. ఇది రేపటి వరకు కొనసాగే అవకాశం అంటున్నారు. 3,36,013 బయలెట్ల లెక్కింపును మొత్తం 96 టేబుళ్ళ మీద చేపట్టనున్నారు.