- జిల్లా సరిహద్దు గుండా పశువుల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి జిల్లాలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు
- అక్రమంగా పశువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉన్నచో పోలీసులకు తెలపాలి.
- జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి
ముద్ర. వనపర్తి:- ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా లేదా దృష్టికి వస్తే పోలీసులకు, 100, కంట్రోల్ రూమ్ 63039 23200 కు సమాచారం అందించాలే తప్ప, స్వయంగా వెళ్లి పశువులను అక్రమంగా అడ్డుకోనీ గొడవలు సృష్టించి అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జిల్లా ఎస్పీ రక్షిత మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా రవాణా చేసే అవకాశం ఉన్నందున, పశుసంవర్ధక శాఖ అధికారుల సమన్వయంతో జిల్లాలో మూడు చెక్ పోస్టులను నిర్వహించి ఎలాంటి అక్రమ తరలింపునకు పాల్పడకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బక్రీద్ పండుగను శాంతి పూర్వకంగా ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి ప్రణాళికలతో కార్యచరణ సిద్దం చేసింది.
జిల్లా లో గోపాల్ నేషనల్ పేట బుద్ధారం గండి దగ్గర, పెద్దమందడి మండలం హైవే మోజర్ల, పెబ్బేరు బైపాస్ దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధాన పశువుల సంతలో పశువుల రవాణాకు కావాల్సిన అనుమతి పత్రాలను పరిశీలించి, అనుమతులు లేని వాటిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వధశాలకు అనుమతి లేని పశువులను, దూడలు,గోవులను అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని పశువుల వ్యాపారులు ఈ సూక్ష్మంగా గుర్తించారు. పశువులను ఒకచోట నుండి మరొక చోటికి తరలించడానికి పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా వెంట ఉండవలసి ఉంటుంది, పశువుల సంతలో కొనుగోలు చేసిన వారికి అమ్మిన వారి వివరాలు, సంబంధిత పశువైద్యాధికారి ధ్రువీకరించిన ఆరోగ్య, రవాణాకు అనుమతి పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అధికార పోలీసులకు, పశుసంవర్ధక శాఖ అధికారులకు ఉంటుందన్నారు. బక్రీద్ పండుగ సందర్బంగా ప్రజల చట్టబద్ధమైన నిబంధనలు పాటిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు, పండగలు పూర్తయ్యేవరకు అదనంగా పెట్రోలింగ్ వాహనాలతో జిల్లా అంతటా నిఘా పెట్టినట్లు జిల్లా ప్రజలకు సంపూర్ణ శాంతి పూర్వకమైన వాతావరణం కల్పించేందుకు జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారన్నారు. శాంతిభద్రతల సమస్యలులేని జిల్లాగా గుర్తింపు ప్రతి ఒక్కరూ బాధ్యతతో జిల్లా అభివృద్ధికి తోడ్పడాలన్నారు.