ముద్ర,తెలంగాణ:- గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదీలీలకు సంబంధించిన షెడ్యూల్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వరుసగా ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతూ వస్తుంది. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన షెడ్యూల్ నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం విద్యాశాఖలు బాధ్యత చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ఈ ప్రక్రియ పూర్తయితే 10,449 మందికి ఎస్ఏలుగా, 778 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 6 వేల మంది ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు.