ముద్ర /షాద్ నగర్ : ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం పట్ల షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు బక్కని నర్సింలు స్థానిక నేతలు సన్మానించారు. శుక్రవారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు స్వగృహంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బక్కని నర్సింలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని ఇవ్వడం గుర్తు చేశారు.
నేడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ సుమారు 130 స్థానాల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనను ప్రజలు పూర్తిగా స్వాగతిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు పనిచేశారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు కలసి శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, కౌన్సిలర్లు కానుగు అంతయ్య, సర్వర్ పాషా, నేతలు భూపాల్, విజయ్ కుమార్, రాయల్ శంకర్, ఆర్య వైశ్య సంఘం నాయకులు గందె సురేష్ లు ఉన్నారు.