ముద్ర,తెలంగాణ:-జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. వారికి న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అలాగే జీతాలు రావట్లేదని సీఎం ఇంటి వద్ద నర్సింగ్ స్టాఫ్ నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.