ముద్ర,తెలంగాణ:- ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గురుకుల విద్యాసంస్థల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 75 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బీజీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ గురుకుల జూనియర్ కళాశాలకు రూ. 25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాలలకు రూ. 50 కోట్లు ఇచ్చారు.