ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీ సిబ్బంది వేప చెట్టు కొమ్మకు నిర్లక్ష్యంగా విద్యుత్ దీపాన్ని అమర్చడంతో ముద్రణ దినపత్రికలో “విద్యుత్ స్తంభంగా వేపచెట్టు – గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం” అనే వార్త రావడంతో అధికారులు స్పందించి వేప చెట్టు కొమ్మకు విద్యుత్ దీపాన్ని గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు. విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేయాల్సిన వీధి దీపాలను వేప చెట్టుకు ఏర్పాటు చేయడంతో గ్రామస్తుల నుంచి విమర్శలు వచ్చాయి.