ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్ గా అభిలాష అభినవ్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కలెక్టర్ల బదిలీలలో భాగంగా జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అభిలాష అభినవ్ నిర్మల్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ కలెక్టర్ తన ఛాంబర్ లో కలెక్టర్ గా ఆమె ఆదివారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. నూతన కలెక్టర్ గాలు బాధ్యత స్వీకరించిన జిల్లా కలెక్టర్ ను ఆర్డీఓ, ఇతర జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.