- భారీగా ఇసుక డంపులు
- వరి ధాన్యం మాదిరిగా ఇసుక కుప్పలు
- పట్టించుకోని, మైనింగ్ శాఖల అధికారులు
ముద్ర,పానుగల్:- పానుగల్ మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. వారి గోప్లాపూర్,చిక్కేపల్లి,దావాజిపల్లి,బుసిరెడ్డిపల్లి, తెల్లరాళ్లపల్లి ఇతర గ్రామాలలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది.గోప్లాపూర్ గ్రామంలో పాఠశాల సమీపంలో భారీగా ఇసుకను డంపు చేశారు.రాత్రి వేళల్లో ఇతర గ్రామాలకు ఒక్కొక్క ట్రాక్టర్‌కు 3 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ,రాత్రి వేళలో యథేచ్చగా విక్రయిస్తున్నారు.
కొన్ని రోజులుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన శాఖలైన పట్టించుకోకుండా, మైనింగ్ శాఖల అక్రమ ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.