ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యారంగ సమస్యలపై ఎబివిపి ఇచ్చిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయింది. మెజారిటీ విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై రెండు వారాలు పాఠశాలలు ఇప్పటివరకు విద్యార్థులకు, దుస్తులు రాలేదని ఎబివిపి నేతలు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, నోటు పుస్తకాలు, అక్రమంగా, ధరలకు విక్రయిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించు కోవడం లేదని వారు తెలిపారు. ఇక ప్రైవేట్ విద్యాసంస్థలు లక్షల్లో ఫీజులు దండుకుంటున్న అధికారులు చూసి చూడనట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ బంద్ కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూరు విభాగం కన్వీనర్ శివకుమార్ నిర్వహించారు.