- కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతాను
- అద్బుతమైన ప్రణాళిక రూపొందించండి
- అభివృద్దిలో నా మార్క్ చూపిస్తా…
- కరీంనగర్ అభివృద్దిపై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగులతోనూ కలిసి చర్చిస్తా
- స్మార్ట్ సిటీ కింద మిగిలిన నిధులు త్వరలో అందిస్తా
- జన్మభూమిని కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటా
- అందరం కలిసి కరీంనగర్ అభివృద్ది కోసం పనిచేద్దాం
- మాని రాబోయే జనరల్ బాడీలో అద్బుతమైన ప్రణాళికను రూపొందించండి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
- సంజయన్నా…. మిమ్ముల్ని మరవదు ఈ గడ్డ
- మీ సహకారం మరువలేనిది….
- కేంద్రం మరిన్ని నిధులు తీసుకురండి
- బండి సంజయ్ కు మేయర్ సహా కరీంనగర్ కార్పొరేటర్ల వినతి
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపే కార్పొరేటర్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను సన్మానించారు. మాజీ డిప్యూటీ మేయర్లు గుగ్గిళ్ల రమేశ్, అబ్బాస్ షమీ సహా 30 మందికిపైగా కార్పొరేటర్లు హాజరై బండి సంజయ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తోన్న అనుబంధాన్ని పలువురు కార్పొరేటర్లు గుర్తు చేసుకున్నారు. కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన నేపథ్యంలో బండి సంజయ్ పడిన కష్టాలను, చేసిన పోరాటాలను ప్రస్తావించారు. తమతో కలిసి కార్పొరేటర్ గా పనిచేసిన సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగడం గర్వకారణమన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్రం పొడిగించినందుకు కార్పొరేటర్లంతా బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంతో మాట్లాడి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్దికి మరిన్ని నిధులు తీసుకురావాలని. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్.. ‘కరీంనగర్ అభివృద్దికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. అద్దంలా తీర్చే బాధ్యత నాది.’ అని హామీ ఇచ్చారు. జన్మనిచ్చి నన్ను ఇంత వాడిని చేసిన కరీంనగర్ ను అద్బుతంగా అభివృద్ది చేసి రుణం తీర్చుకునేందుకు కసితో పనచేస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…
ఇలాంటి సందర్భం వస్తుందని, అందరూ కలిసి సన్మానిస్తారని నేను ఊహించలేదు. ఇదే కార్పొరేషన్ లో నేను రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేసిన నన్ను గుర్తించి సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. కార్పొరేటర్ గా ఎన్నిక కావడం సాధారణ విషయం. సమస్యలపై అవగాహన తెచ్చుకుని పరిష్కరించాలంటే కిందిస్థాయి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్లకే సాధ్యం. ఇక్కడున్న కార్పొరేటర్లలో భవిష్యత్తులో ఎంపీ, కేంద్ర మంత్రి కావాలంటూ అభిలాషించారు.
ఈరోజు దేశమంతా చర్చ జరుగుతోంది. సాధారణ కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి కాగాలరని చర్చ జరుగుతోంది. గతంలో కార్పొరేటర్లందరం కలిసి ఉండేవాళ్లం. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకునే వాళ్లం. కానీ గత కొంత కాలంగా కార్పొరేటర్ల మధ్య గ్యాప్ వచ్చింది. ఇకపై గొడవల్లేకుండా కలిసి పనిచేయాలని కోరుతున్నా. ఈ సందర్భముగా కార్పొరేటర్ గా ఉన్నప్పటి అనుభవాలను సంజయ్ గుర్తుచేసుకున్నారు.
ఇప్పటి వరకు కరీంనగర్ కార్పొరేషన్ కు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించింది. ఇకపై ఎక్కువ నిధులు తెచ్చేందుకు ప్రయత్నించా. ఎందుకంటే గతంలో నన్ను గుర్తుపట్టేవాళ్లు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి దిగిపోయాక దేశవ్యాప్తంగా ప్రముఖులు, కేంద్ర మంత్రులు గుర్తు పడుతూ చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. కార్పొరేషన్ ను వదిలే ప్రసక్తే లేదు. అన్ని విధాలా అభివృద్ది చేస్తా. పేరు కోసం పనిచేయడం లేదు. నాకు జన్మనిచ్చిన ఈ గడ్డ కోసం కార్పొరేషన్ ను అభివృద్ది చేస్తా…
గతంలో అమృత 1 కింద 132 కోట్లు వచ్చాయి. అందులో కేంద్రం వాటా రూ.66 కోట్లు. ఆ నిధులవల్లనే నిరంతరం నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. ఈ మధ్య అమ్రుత్ 2 కింద మరో 147 కోట్లు మంజూరైతే. కేంద్రం తన కోట్ల వాటా కింద 73.5 ను ఇప్పటికే విడుదల చేసిందని చెప్పవచ్చు. స్మార్ట్ సిటీ మిషన్ కింద మొత్తం 934 కోట్లు మంజూరైతే…. అందులో 765 కోట్లు ఇప్పటికే వచ్చాయి. ఇంకా 176 కోట్లు రావాల్సి ఉంది. అందులో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద 100 కోట్లదాకా రావాలి. కేంద్రం నుండి 70 కోట్లు వస్తాయి. కేంద్రం నుండి ఆ నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్దిపై ప్రణాళిక రూపొందించబడింది. వాటి అమలుకోసం నిధులు తీసుకొస్తా, అయితే మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి. కేంద్రం నేరుగా నిధులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, వాటా ఉంటేనే కేంద్రం నిధులు ఇవ్వగలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేరుగా కేంద్రం నిధులిచ్చే అవకాశం ఉంటే కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దేవాడిని.
మీకు ఇంకో 7 నెలల పదవీ కాలం ఉంది. కష్టపడి పనిచేయండి. మళ్లీ అందరూ గెలవాలని కోరుకుంటున్నా. ఎన్నికలప్పుడు మాత్రం నా పార్టీ(నవ్వుతూ) గెలవాలనుకుని పనిచేస్తా. కోపాన్ని వీడండి. గొడవలకు తావివ్వకుండా కలిసి పనిచేయండి. మీరు నవ్వుతూ అందరితో ఐక్యంగా ఉంటూ పనిచేయండి. కసురుకుంటే మంచి ఫలితం రాదు.. తప్పకుండా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్దికి క్రుషి చేయండి. నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. అభివృద్ది చేసే బాధ్యత నాది.
మేయర్ నన్ను ఇటీవల కలిసి కార్పొరేషన్ అభివృద్ది కోసం అద్బుతమైన ప్రణాళికను మా ముందుంచారు. క్రుషి చేస్తా… బహుశా రాబోయే జనరల్ బాడీ చివరి సమావేశం కాదు.. పేరు కోసమో, మీడియా కోసమో కాకుండా ప్రజల కోసం చర్చించండి. ప్రణాళిక రూపొందించండి. ప్రజలకు మంచి మెసేజ్ వెళ్లేలా మాట్లాడండి. ఆ ప్రణాళిక అమలు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లను కలిసి చర్చిస్తా. నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది అని స్పష్టం చేశారు.