ముద్ర, తెలంగాణ బ్యూరో : బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్ యూ నేతలు యత్నించారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు పీడీఎస్ యూ నాయకులు గన్ పార్క వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీనితో గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, బహుమతి షిప్‌లను విడుదల చేయడం, అలాగే విద్యా శాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, ఉద్యోగాల ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.