ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా నుంచి బాక్సింగ్ అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు సిఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఇటీవల కలకత్తాలో జరిగిన 2వ ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో, ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ బాక్సింగ్-2024 పోటీల్లో తెలంగాణ నుంచి ప్రముఖ మహిళా విద్యార్థి కామారెడ్డి జిల్లా పిట్లం కు చెందిన క్రీడాకారిణి, వరల్డ్ ఛాంపియన్ తక్కడ్‌పల్లి ప్రతిభ 5 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ జూనియర్, సబ్స్ విభాగంలో బాన్సువాడ కు చెందిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుమారుడు పోచారం రుషాంక్ రెడ్డి 2 గోల్డ్ మెడల్స్, సీనియర్ పురుషుల విభాగంలో పిట్లం కు చెందిన తక్కడ్పల్లి విజయ్ రాఘవేంద్రరావు 2 సిల్వర్ మెడల్స్ సాధించారు.
అంతర్జాతీయ స్థాయిలో 10 మెడల్స్ సాధించిన క్రీడాకారులను తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అభినందించారు.టీఎం తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంలో ట్రైనింగ్ ఇచ్చిన ప్రతిభ తక్కడపల్లికి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే పోచారం నివాసంలో క్రీడాకారులను అభినందించారు.