హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తు, అతివేగంతో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత కరెంట్ స్తంభాలను సైతం ఢీకొట్టి దూసుకెళ్లింది. స్పాట్‌లోనే వ్యక్తి మృతి చెందాడు. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఈ ఘటన జరిగింది.
ప్రమాదం తర్వాత కారులోంచి దిగిన ఆరుగురు యువకులు కారును తీసుకెళ్లేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మృతుడు సెక్యూరిటీ గార్డు గోపిగా పేర్కొన్నాడు.
సీసీటీవీ ఫుటేజ్.. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు.
హైదరాబాద్ – గాజుల రామారంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డ్ గోపి(38)ని అతివేగంగా ఢీకొట్టిన కారు.
ప్రమాదంలో గోపి అక్కడికక్కడే మృతి.. మద్యం మత్తు కారు డ్రైవ్ చేసినందుకే ప్రమాదం జరిగింది… pic.twitter.com/GdA6qrpshT
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) ఆగస్టు 11, 2024