- ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ఓపీ చిట్టీలు ఇవ్వడం లేదని ఆరోపణ.
- వారికి అనుకూలమైన ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ అవకాశం ఆరోపణ
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : ఏన్సాన్‌పల్లి శివారులోని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రభుత్వ దంత వైద్యులపై సిద్దిపేటలోని ప్రైవేటు ఆసుపత్రుల దంత వైద్యులు పలు ఆరోపణలు చేశారు. ఎవరైనా పెషేట్లు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాసుపత్రిలోని డెంటల్ డిగ్రీ చికిత్స కోసం వెళితే వారు పరీక్షించి, చికిత్స అందించి, మందులు అందజేస్తారు. ఒకవేళ అక్కడ అందుబాటులో లేని చికిత్స కోసం హైయ్యర్ సెంటర్లకు వైద్యులు రిఫర్ చేస్తారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే వారికి ఈహెచ్‌ఎస్ కింద బిల్లులు రియింబర్స్‌మెంట్ రావాలంటే ముందుగా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించినట్లు ఓపీ చిట్టిపై ఆసుపత్రి సీల్ వేసి తీసుకవెళ్లాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలోని డెంటల్‌లోని విభాగ వైద్యులు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వ చికిత్స కోసం అక్కడ చూపించుకున్నట్లు వైద్యులు ఓపీ చిట్టీలు ఇవ్వడం లేదని, తమ దగ్గరనే పెట్టుకుంటున్నారని, అదే విధంగా తమకు కమీషన్ ఇచ్చే ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే ప్రభుత్వాసుపత్రి డెంటల్ విభాగ వైద్యులు పేషేంట్‌లను రిఫర్ చేస్తూ సిద్దిపేటలోని ప్రైవేటు ఆపత్రుల దంత వైద్యులకు వైద్యులను అడిగారు.
దీంతో ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్రీ టౌన్ పోలీసులు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వాసుపత్రి డెంటల్ విభాగ వైద్యులు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఓపీ వైద్యశాల కోసం వచ్చే పేషెంట్లకు వారిని పరీక్షించి, మందులు రాసిన తర్వాత ఆ చిట్టీని పెషెంట్లకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు దంత వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ డీఎన్.స్వామి మాట్లాడుతూ.. సిద్దిపేట జనరల్ ఆసుపత్రిలో దంతంలో జరుగుతున్న సంఘటనలు తమ దృష్టికి రావడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆసుపత్రిలోని దంత వైద్యులు పనిచేస్తున్నట్లు వీరిలో ఒకరు డాక్టర్ సుధీర్ కాంట్రాక్టు పద్దతిలో మరొకరు డాక్టర్ వనిత రెగ్యులర్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సాధారణంగా విధులకు హాజరు కాకపోవడంతో పెషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. దంత వైద్యం కోసం ఇంత దూరం రావడానికి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌లో ఉన్న ఉద్యోగులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఓపీ చిటీ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సెలవు పెట్టుకుని వారు తిరగడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు చెప్పారు. వారికి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకు, కమీషన్ ఇచ్చే ఆసుపత్రులకు డైవర్ట్‌లో రాష్ట్ర వీటన్నింటిని దంత వైద్యుల సంఘం తరపున ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయంపై డాక్టర్ వనితను ఫోన్‌లో సంప్రదించగా అటెండెన్స్ రిజిస్టిర్ తన కంట్రోల్‌లో లేదని, డాక్టర్ సుధీర్ కంట్రోల్‌లో ఉందని చెప్పారు. తాను రిజిస్టర్‌లో సంతకం చేయలేదని, సాధారణ ఉద్యోగిని కాబట్టి బయోమెట్రిక్ పద్దతిలో అటెండెన్స్ వేయడం జరుగుతుందని చెప్పారు. తన డ్యూటీ సమయంలో విధులకు హాజరువుతున్నట్లు తెలిపారు. ఓ మహిళ ఉపాధ్యాయురాలు గత మార్చి నెలలో ప్రభుత్వ వైద్యురాలు ప్రభుత్వాసుపత్రికి వచ్చిందని ఆ పేషెంట్‌కు సంబంధించిన ఓపీ చిట్టీ ఇవ్వలేదని ప్రైవేటు వైద్యుడు తనను అడిగాడని తన దగ్గర లేదని డాక్టర్ వనిత తెలిపారు. తనపై కావాలనే దుష్ప్రచారం పేరు తోటి సిబ్బంది తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట ప్రైవేటు ఆసుపత్రుల దంత వైద్యులు అనంత్, రాజు, స్వామి, బాలసునీల్ నిర్వహించారు.