మోత్కూర్, ముద్ర: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వలిగొండ తొర్రూర్ ప్రధాన రహదారిపై అడ్డగూడూరు మండలం చౌళ్ళ రామరం గిడ్డంగుల గోదాము వద్ద రహదారి నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి నిర్మాణంతో వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుండటంతో వలిగొండ తొర్రూరు ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
తొర్రూరు, మహబూబాబాద్, సూర్యాపేట డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు నిత్యం ఈ రహదారి గుండా హైదరాబాదుకు రాకపోకలు సాగిస్తుంటాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సహాయక సిబ్బంది తగు చర్యలు తీసుకుంటున్నారు.