ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే, నిందితులపై రౌడీషీట్స్ తెరుస్తామని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలియజేశారు. ఈ దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుషాయిగూడ డిపో డ్రైవర్ గణేష్ ను శనివారం నాడు ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును డ్రైవర్ ను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందదని భరోసా ఇచ్చారు.
డ్రైవర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను పొందడం. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో డ్రైవర్ పై దాడి చేసిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజల మధ్య విధులను నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలపై ఆర్టీసీ సీరియన్ గా వ్యవహరిస్తుందన్నారు. వారిపై చట్టప రంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.