- పలు యూనివర్సిటీలకు వీసీల నియామకాలు
- ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఎప్పుడెప్పుడా అని యూనివర్సిటీల నియమాకాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు యూనివర్సిటీల వీసీల నియామకాన్ని చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా గత తాత్కాలికంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పోస్టును ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ అవకాశం ప్రొఫెసర్ బాల కృష్ణారెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్ గా, వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంలను ప్రభుత్వం నియమించింది. వీరు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలుస్తుంది. ప్రొఫెసర్‌రెడ్డి ప్రస్తుతం నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు.
అలాగే రాష్ట్రంలో పలు యూనివర్సిటీల ఇంఛార్జ్ వీసీలను సైతం మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ఏర్పడిన కోటి మహిళా కళాశాలకు ఇంఛార్జి విసిగా ధనావత్ సూర్యను, బాసర ఐఐటీ ఇంఛార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.