- సూర్యాపేట జిల్లా అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేస్తానంటున్న చెవిటి వెంకన్న యాదవ్?
- వ్యవసాయ కమీషన్ కమిటీ సమన్వయ సభ్యునీ పదవి ఇవ్వడంపై సూర్యాపేట డిసిసి చెవిటి వెంకన్న యాదవ్ అసంతృప్తి ?
- తనకు సమన్వయ కమిటీ సభ్యుడి పదవి అవసరం లేదంటున్న చెవిటి ?
తుంగతుర్తి ముద్ర:- సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కు రాష్ట్ర రైతు కమీషన్ కమిటీ సభ్యుడిగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే .కాగా రైతు సమన్వయ కమిటీ సభ్యులుగా ఇవ్వడం పట్ల చెవిటి వెంకన్న యాదవ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది . తనకు ఎలాంటి ప్రాధాన్యత లేని కమిటీ సభ్యత్వం ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వెంకన్న యాదవ్ తనకు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కూడా అవసరం లేదంటున్న ఇట్లు విశ్వసినియ వర్గాల బోగట్ట .ఆ పదవిని తాను కోరుకోలేదని తన అనుయాయుల వద్ద చెబుతున్నట్లు . .
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇద్దరు పర్యాయాలు పనిచేశానని జిల్లాను అగ్రగామిలో కాంగ్రెస్ కార్యకర్తగా క్రమశిక్షణతో నిలిపివేసినట్లు పార్టీ సభ్యత్వం ఇవ్వడం పట్ల చెవిటి వెంకన్న యాదవ్ విజయవంతంగా ప్రకటించారు. కాగా నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆ పదవి తనకు లేదని చెబుతున్నట్లు. ఈ విషయంపై అధిష్టానం ఏ విధంగా నమోదైందో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి చెవిటి వెంకన్న యాదవ్ ఏ విధంగా స్పందించారు అనేది ఒకటి రోజుల్లో తేలింది. కాగా చెవిటి వెంకన్న యాదవ్ కు ప్రాధాన్యత ఉన్న కార్పొరేషన్ కమిటీకి చైర్మన్ ఇస్తారని ఆయన అభిమానులంతా ఆశించారు .అలా జరగిన వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా అధిష్టానం వెంకన్న యాదవ్‌ను ఏ మేరకు సంతృప్తిపరుస్తుందో వేచి చూడాల్సి ఉంది.