- వినతి పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ముద్ర.వీపనగండ్ల :- అసెంబ్లీ ఎన్నికల ముందు వీపనగండ్ల గ్రామస్తులకు ఇచ్చిన హామీలను, అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య, రైతు సమన్వ సమితి మండల మాజీ అధ్యక్షులు ఏత్తం కృష్ణయ్య ఆధ్వర్యంలో గురువారం హైదరాబాదులోని సచివాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినతి పత్రం అందజేశారు. నూతనంగా నిర్మించిన విద్యుత్ ఏఈ కార్యాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని, శంకుస్థాపనకు పరిమితమైన తాసిల్దార్ కార్యాలయ భవనాన్ని, వెంటనే నిర్మాణం చేపట్టాలని, కొత్త గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. కూలటానికి సిద్ధంగా ఉన్న మండల మహిళా సమైక్య భవనాన్ని కొత్తగా నిర్మించాలని, గ్రామంలో మూడు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఇబ్బందులు పడకుండా నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి భవన నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతున్నారు. ఎస్సీ గురుకుల పాఠశాల నిర్మాణ నిధులు కేటాయించాలని, వసతులు లేక కొత్తకోటకు తరలించిన గురుకుల పాఠశాలను వీపనగండ్లలోని ప్రభుత్వ వసతి గృహంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయడం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం, విద్యుత్ సబ్‌స్టేషన్ సిబ్బందికి నూతన నిర్మాణం భవనం, మండల పశువైద్యశాల నిర్మించాలని మంత్రి దృష్టికి తెచ్చారు.
మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిలో ఉన్న సరైన వైద్య సిబ్బంది పరికరాలు లేకపోవడంతో పత్రికలు వచ్చే రోగులకు ఇబ్బందులు పడాలని వైద్య సిబ్బందిని నియమించారు, మండల కేంద్రం నుండి కల్వరాల మీదుగా కేతేపల్లి వరకు డబల్ రోడ్డు బిటి రోడ్డు నిర్మాణం, బెక్కెం రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వీపనగండ్ల చిన్నంబావి మండల రైతులు ఎంతో ఆతృతగా సింగోటం-గోపాల్‌దిన్నె లింక్ కాల్వపనులను వెంటనే ప్రారంభించి చివరి ఆయకట్టు రైతులకు సాగును అందించాలని, మండల ప్రధాన రహదారికి ఇరులా మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలని, సివిల్ సప్లై గోదాం, సీఐ కార్యాలయం ఏర్పాటు, సబ్ కోర్ట్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టాలని కోరుతూ మంత్రి జూపల్లికి వినతి పత్రం. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బసవరాజ్ గౌడ్, రవీందర్ రెడ్డి, గోపి, భరత్ రెడ్డి, సోడా వెంకటయ్య, అనుకలి నరసింహ ఉన్నారు.