- ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం
- బీఆర్ఎస్ హయాంలో పదేండ్ల కిందట ఇదే సర్వే
- ఇప్పుడు మళ్లీ సర్వేకు దిగిన సర్కారు
- మొత్తం 75 ప్రశ్నలు
- ఈసారి సమగ్ర వివరాల సేకరణ
- ఇప్పటికే క్షేత్రస్థాయిలో సిబ్బంది
- ప్రారంభానికి ఐసీసీ అగ్రనేతలు
- రాష్ట్రంలో చేసే సర్వేను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసే ప్రయత్నం
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్రంలో మళ్లీ సర్వే ఫీవర్ జాబితా. ఈ నెల ఆరు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాలను సేకరించాలన్న లక్ష్యంతో ఈ సర్వేను చేపడుతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో సర్వే ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో రాష్ట్రమంతా సర్వేమయం. సరిగ్గా పదేళ్ల క్రిందట కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాంటి సర్వేనే చేపట్టింది. అయితే ఆ సర్వే వివరాలను మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అసలు ఈ సర్వే ఏమైందో కూడా ఎవరికి అంతుపట్టలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంది.
గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సర్వే చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల నుంచి సేకరించే వివరాలు సమగ్రంగా ఉండాలని కోరింది. ప్రతి ఇంటికి వెళ్లి…. ప్రతి వ్యక్తి వివరాలను సూచించింది. ఈ మేరకు ప్రత్యేకంగా నియమించిన సిబ్బందికి… తగు తర్ఫీదును కూడా ఇచ్చింది. మొత్తం 75 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను సర్వేలో సేకరించారు. కాగా ఈ నెల 6వ తేదీన రాష్ట్రంలో మొదలయ్యే ఇంటింటి సమగ్ర సర్వే ప్రారంభోత్సవానికి ఏఐసీసీ చేపట్టిన అగ్రనేతలు సైతం హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక రాష్ట్రంలో జరిగే సర్వేతో మంచి ఫలితాలు వస్తే.. అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ సర్వే చేపట్టనుందని తెలుస్తోంది.
కాగా సర్వే చేసే సమయంలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఏం అడుగుతారు ? ఏం సమాధానం చెప్పాలి ? ఏ పత్రాలు దగ్గర పెట్టుకోవాలని అందరిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కుటుంబ సర్వే కోసం ముత్తం 75 ప్రశ్నలకు గానూ 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-1, పార్ట్-2 కింద ఎనిమిది పేజీల్లో ఎన్యుమరేటర్ సమాచారం పూరిస్తారు. ఇందులో పార్ట్-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. పార్ట్-బి కింద కుటుంబ వివరాలను సేకరిస్తారు. ఇందులో 17 ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు మిగిలినవి అనుబంధ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టనున్నారు. కుటుంబసభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, ఇల్లు, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న బ్యాంకు లోన్ల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అప్పులు ఎందుకు తీసుకున్నారు. ఎక్కడ నుంచి రుణం పొందారు. ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ వివరాలను సైతం తీసుకుంటారు.
సర్వేకు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులు, రైతులతో పాటు ధరణి పాస్ పుస్తకాలు దగ్గర పెట్టుకోవడం మంచిది. విద్యుత్ కనెక్షన్ వంటి వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. పాన్ కార్డు వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది.అయితే సర్వే సందర్భంగా కుటుంబీకుల ఫొటోలు తీసుకోరు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. కుటుంబంలో అందరూ ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబ యజమాని ఉంటే సరిపోతుంది. ఆయా వివరాలు చెబితే సరిపోతుంది. అయితే ఈ విధంగా గోప్యంగా ఉంచుతారు. బ్యాంక్ ఏటీఎం కార్డు నెంబర్, ఓటీపీ, పిన్ స్టాప్ అడిగితే ఇవ్వొద్దని సూచించింది.