- ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ను కలిసిన రేషన్ డీలర్లు
ముద్రప్రతినిధి, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధంగా ఒత్తిడి పెంచాలని, రాష్ట్రప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం స్పందించాలని మహబూబాబాద్ జిల్లా రేషన్ డీలర్లసంఘం నాయకులు తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో రేషన్ డీలర్ల సమస్యను శాసనమండలిలో లేవనెత్తిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ను గురువారం మహబూబాబాద్ లోని ఎమ్మెల్సీ క్యాంపులో పాల్గొని ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ.. తమ సమస్యలను పరిష్కరించాలని పలువిధాలుగా ఇప్పటికే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నామని, అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంకా తమ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రేషన్ డీలర్ల న్యాయమైన కోరికలను తీర్చాలని అభ్యర్థించారు. ఈ..సందర్బంగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం తాను ఖచ్చితంగా పోరాడతానని, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టి సమస్యలను పరిష్కరించేంత వరకు రేషన్ డీలర్లకు అండగా నిలుస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావును సత్కరించారు.