- మానుకోటలో ఘనంగా సీపీఐ ఆవిర్భావ వేడుకలు
ముద్ర ప్రతినిధి మహబూబాబాద్: పేదలకు, అణచివేతకు పెరుగుతున్న వర్గాలకు ఎర్రజెండా ఎప్పుడు అండగా నిలుస్తుందని, 100 సంవత్సరాలుగా సీపీఐ పార్టీ పేదల పక్షాన పోరాటం కొనసాగుతుందని పార్టీ మహబూబాబాద్ జిల్లాకార్యదర్శి బి విజయసారధి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయం వీరభవన్ లో పార్టీ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ…సందర్భంగా సీపీఐ పార్టీ పతాకాన్ని జిల్లా కార్యదర్శి విజయసారధి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… వంద సంవత్సరాలుగా ప్రజలు తమ భుజాలపై సీపీఐ పార్టీ జెండాను మోస్తున్నారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా, వారి పక్షాన పాలక వర్గాలను ప్రశ్నించాల్సిన ఏ..సందర్భం వచ్చినా సీపీఐ పార్టీ ముందు వరుసలో నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్లే ఇంతకాలం ప్రజల హృదయాల్లో సిపిఐ సజీవంగా ప్రదర్శన.
అనేక రకాల ఇబ్బందులు ఎదురైన, ఆటుపోట్లు ప్రజలు సీపీఐ పార్టీని కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్లారు. వంద సంవత్సరాల చరిత్రలో జరిగిన ప్రతిపోరాటంలోనూ సిపిఐ పార్టీ పోషించిన పాత్ర అత్యంత గొప్పదని, నాటినుంచి… నేటిదాకా పాలక పక్షాలను ప్రశ్నించడంలో సిపిఐ పార్టీ ముందువరుసలోనే ఉందని తెలిపారు. ప్రజల పక్షాన పోరాడుతున్న సీపీఐ పార్టీని ప్రజలే కాపాడుకుంటారని, ప్రతి పోరాటంలోనూ పీడిత తాడిత వర్గాలు తోడుగా నీడగా ముందుకు సాగుతారని విజయసారధి అన్నారు. అనంతరం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సీపీఐ శ్రేణులు భారీప్రదర్శన నిర్వహించారు. ఈ.. ఆవిర్భావ వేడుకలలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సీపీఐ పార్టీ జిల్లా సహాయకార్యదర్శి బి అజయ్, పార్టీ నాయకులు రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి పరిస్థితి నెలకొంది.