ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 5 యాంకర్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న టీవీ 5 ఛానల్ న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిందని, కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. టీవీ 5 యాంకర్ సింధూర శివ, చైర్మన్ బీఆర్ నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని రవీంద్రనాథ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
17న యాంకర్ సింధూర శివ న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తి, న్యాయవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ న్యాయవ్యవస్థను, న్యాయవ్యవస్థ అస్తిత్వాన్ని కించపరిచేలా కామెంట్స్ చేశారు. కోర్టు వెబ్సైట్లోకి చొరబడి న్యాయ ప్రక్రియ, వాదనలు సహా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి ఆ కంటెంట్‌ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఈ మేరకు ప్రముఖ న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ సింధూర శివ, బీఆర్ నాయుడు, రవీంద్రనాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.