- సినీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలుస్తాం
- ఆ రంగ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
- సినీరంగం కూడా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి
- శాంతిభద్రతల విషయంలో రాజీపడడం
- మదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారం కల్పించండి
ముద్ర, తెలంగాణ బ్యూరో : భవిష్యత్తులో సినీ పరిశ్రమలకు ఎలాంటి బెనిఫిట్ షోలు.. రాయితీలు ఇచ్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్న ఆయన శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే అందించారు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంటుందన్నారు. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తున్నట్టు ప్రకటించారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.
గురువారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌లో సినీ ప్రముఖులతో భేటీ అయిన సీఎం వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. అనంతరం ప్రభుత్వంపై వారి అనుమానాలు, అపోహలు, ఆలోచనలు ఇరువురు పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమనీ ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందనే పరిశీలించాలన్నారు. సినీ పరిశ్రమపై తనకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాల నిర్మాణం అంతా కలిసి అభివృద్ధి చేద్దామని.
సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో చొరవ చూపాలని సినీ ప్రముఖులకు సూచించారు. అలాగే ఆలయ పర్యటకం, ఎకో టూరిజంను ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలోనూ ఇండస్ట్రీకి సహకరించాలని. మరోవైపు ఇక బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటామని హెచ్చరించిన సీఎం.. వారిపై నియంత్రణ పెట్టుకోవాల్సిన బాధ్యత సెలబ్రెటీలదేనన్నారు. తమ ప్రభుత్వం ఎనిమిది సినిమాలకు స్పెషల్ జీవో లు ఇచ్చింది. పుష్ప సినిమాకి పోలీస్ గ్రౌండ్ ఇచ్చామన్న సీఎం..తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఐటీ, ఫార్మా తో పాటు తమకు సినిమా పరిశ్రమ కూడా ముఖ్యమన్నారు. తెలంగాణ లో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండేందుకు దిల్ రాజు ను ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించినట్లు వివరించారు. తెలంగాణ లో ఎక్కడైనా ఘాటుగా హైదరాబాద్ కు రెండు గంటల్లో రావొచ్చన్నారు. ముంబయిలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడి ఉండేది. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అన్నారు. హాలివుడ్,బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేశామన్నారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ జితేందర్‌తో పాటు 50 మంది సినీ ప్రముఖులు సమావేశమయ్యారు.
సీఎంతో మాట్లాడిన సినీ ప్రముఖులు :
హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలి : ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే మన సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదిగిందని సీఎంతో సినీ హీరో నాగార్జున చెప్పారు. హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేది తమ కోరిక అన్నారు. యూనివర్సల్ లెవల్‌లో స్టూడియో సెటప్‌లు ఉండాలన్నారు. మర్రి చిన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్‌గుర్తు చేశారు. సీఎంలు అందరూ సినీ పరిశ్రమను బాగానే చూసుకున్నారని దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం సినీ పరిశ్రమను బాగా చూసుకుంటుంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. సంధ్య థియేటర్ ఘటన తమను బాధించిందని సీనియర్ నటుడు మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్‌లో పోటీకి కారణంతోనే ప్రమోషన్ కీలకంగా మారిందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం వల్ల ప్రమోషన్ విస్త్రతంగా చేస్తున్నామని మురళీమోహన్‌సీఎంకు వివరించారు. తాను చిన్నప్పటి నుంచి పరిశ్రమను చూస్తున్నానన్న నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి హైదరాబాద్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని సీఎంను నిర్ణయించారు. ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉందని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తెలిపారు. ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని తెలిపారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ నే కేరాఫ్ అడ్రస్ గా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ డెస్టినేషన్ చేయాలనేది మా కల అని సీఎంతో దగ్గుబాటి సురేశ్ బాబు తెలిపారు. వీరితో పాటు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్‌బాబు, మైత్రి రవి, నవీన్, నాగవంశీ, సి. , గోపీ ఆచంట, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడితల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, వీర శంకర్ , హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ఠ, బీవీఎస్ ప్రసాద్, కె.ఎల్. నారాయణ, రాఘవేంద్రరావు, స్రవంతి రవి కిశోర్, యూవీ వంశీ, రామ్ పోతినేని, కల్యాణ్ రామ్, శివ బాలాజీ, అడవి శేషు, వరుణ్ తేజ్, సాయి ధరణ్ తేజ్, బలగం వేణు, వి. విజయేంద్ర ప్రసాద్, పవర్ బాబీ, వేణు శ్రీరామ్, డీవీవీ దానయ్య, చినబాబు ఉన్నారు.