ముద్రప్రతినిధి, మహబూబాబాద్: వైద్యం సక్రమంగా అందుతుందా…, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా.., నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అంటూ చికిత్స పొందుతున్న పలువురు వద్దకు వెళ్లి ఎమ్మెల్యే మురళీనాయక్ స్వయంగా పలకరించారు. మహబూబబాద్ జిల్లా ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
స్వతహాగా వైద్యుడైన ఎమ్మెల్యే మురళీనాయక్ రోగుల రిపోర్ట్ లను, చికిత్స అందుతున్న తీరును పరిశీలించారు. చుట్టూ పక్కల గ్రామాల పేద ప్రజలు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి వస్తారు కాబట్టి వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తుందని, ప్రతి ప్రభుత్వవైద్యశాలలో కార్పోరేట్ ఆసుపత్రుల స్థాయిలో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ముందుకు సాగుతోందని తెలిపారు.
అనంతరం నూతనంగా నిర్మాణ డయాలసిస్ సెంటర్‌కు సంబంధించిన పనులను పరిశీలించారు. ఇప్పటికే డయాలసిస్ సెంటర్ నిర్మాణం ఆలస్యమైందని, సోమవారం వరకు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి తీసుకొని రావాలని. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ని కూడా పరిశీలించి బయట కన్నా రోగులకు తక్కువ ధరలను భోజనం అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే మురళీనాయక్ తెలిపారు.