ముద్ర, తెలంగాణ బ్యూరో : నూతన సంవత్సరం సందర్భంగా 31న రాష్ట్రంలో మద్యం విక్రయ వేళలను పొడిగించారు. 31వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలు జరుపుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ హెటళ్ళలో అర్థరాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్ముకోవచ్చు. ఇదిలావుండగా, న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే మద్యం అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.