పంజాబ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఖలిస్తాన్ అనుకూల నేత అమృత్‌పాల్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యక్షంకావడం సంచలనం రేపింది. అమృత్‌పాల్‌తో పాటు అతడి అనుచరుడు పపాల్‌ప్రీత్ సింగ్ ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఏప్రిల్ 21న అమృత్‌పాల్ ఢిల్లీలో ఉన్నట్టు ఆధారాలు లభించాయి. ఈ వీడియో ఢిల్లీలోని మధు విహార్ కోసం సంబంధించినది. అమృతపాల్ సింగ్ తలపాగా లేకుండా ఈ వీడియోలో కనిపించాడు. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు అమృత్‌పాల్‌సింగ్ నేపాల్‌కు పారిపోయినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అక్కడి నుంచి పాస్‌పోర్ట్‌తో పారిపోయేందుకు దొంగనట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. నేపాల్‌లో అమృత్‌పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక బృందం చేరుకుంది. గత 16వ తేదీ నుంచి పోలీసులకు చిక్కడం లేదు అమృత్‌పాల్‌సింగ్. ఆయన కోసం పలు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. మరోవైపు అమృతపాల్ తరపు న్యాయవాది షాకోట్ పోలీస్ స్టేషన్‌లో అతను అక్రమ కస్టడీలో ఉన్నాడని వాదించారు.