ఆఫ్రికా దేశం నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతల్లో ఒకటి ప్రసవించింది. ఈ చీతా పేరు సియా. ఇది నాలుగు చీత పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ అభయారణ్యంలో ఈ చీటీలు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో చీతాల జాడలేదు. దానితో నమీబియా నుంచి 8 చీతలను ప్రత్యేక విమానంలో భారత్ తీసుకురాగా, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వాటిని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేశారు. కాగా, సాషా అనే ఆడ చీత ఐటీల కిడ్నీ వ్యాధితో మరణించింది.
అది మరణించిన కొన్నిరోజులకే సియా అనే చీత 4 పిల్ల చీతలకు జన్మనిచ్చింది. 1947లో ఇప్పటి చత్తీస్ గఢ్ లోని కొరియా జిల్లాలో చివరి చీత మృత్యువాత పడింది. భారత్ లో ఇవి అంతరించిపోయిన జాతి అని 1952లో అధికారికంగా ప్రకటించారు. విచ్చలవిడి వేట, విస్తీర్ణం తగ్గడం వంటి కారణాలతో భారత గడ్డపై కనిపించకుండాపోయాయని నిపుణులు చెబుతున్నారు.