రాశీఖన్నా ఈ పేరు తెలియని వారుండరు. ఈ భామ మొదట తెలుగులో ఆశించినన్ని అవకాశాలు రాకపోయినా.. తర్వాత అవకాశాలను అందిపుచ్చుకుంది. మూడు పడవలపై ప్రయాణాన్ని సజావుగా సాగించే ఎత్తుగడలతో ముందుకు వెళుతోంది. తెలుగు, తమిళ్, బాలీవుడ్. తాజాగా తెలుగు పరిశ్రమకు గ్యాప్ ఇచ్చిన రాశీ తమిళం-హిందీ పరిశ్రమలను బ్యాలెన్స్ ఏర్పాటు చేసింది.అయితే దశాబ్ధంన్నర కెరీర్‌లో తానేం ఆశించిందో అది రాశీఖన్నా దక్కించుకోగలిగిందా? అంటే అంతా శూన్యమేనని విమర్శలున్నాయి. కత్రినా-కరీనా రేంజు స్టార్ డమ్ సంపాదించకపోయినా కనీసం సమకాలిన నటి సమంత తో అయినా పోటీపడి రేసులో దూసుకెళ్లడంలో రాశీ వెనక్కు తగ్గింది. త్రిష-కాజల్-నయన్ రేంజ్ రాశికి చిక్కడం అంత సులువు కాదని తేలిపోయింది.
సాగర్ అంబ్రే -పుష్కర్ ఓజా దర్శకత్వం వహించిన చిత్రం భారీ యాక్షన్ సాగ. ప్రైమ్ వీడియో -ధర్మ ప్రొడక్షన్స్ -మెంటర్ డిసిపుల్ ఫిల్మ్స్ తో కలిసి అందించిన ఈ చిత్రంలో యోధుడిగా సిద్ధార్థ్ నటన అసాధారణంగా ఉన్నట్లు టాక్. ఒక కళాకారుడి నుంచి కొత్తగా ఏదైనా బయటికి తేవాలి. యోధా స్క్రిప్టు అలాంటి దానిని బయటకు తీస్తోంది. నాలోంచి నిజంగానే కొత్త వెర్షన్ ను బయటకు తెస్తోంది. ప్రేక్షకులు అభిమానుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ అద్భుతం. యోధాతో వారికి కావాల్సినది సిద్దంగా ఉన్నాను. ఇంకా వేచి ఉండలేను… అని సిధ్ ఎమోషనల్ అయ్యారు.
ఇలాంటి సమయంలో రాశీఖన్నా బాలీవుడ్ లో వరుస ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవల రాజ్ అండ్ డీకే ఫర్జీతో రాశి కి మంచి పేరొచ్చింది.. ఇక పూర్తిగా బాలీవుడ్ కే అంకితమవుతుందా? అంటూ చర్చ సాగింది. ఔట్ సైడర్స్ కి ధర్మ ప్రొడక్షన్స్ ఇంత అవకాశాలు కల్పించడం అనేది అపోహనని రాశీఖన్నాకుముందు కరణ్ ని తాజా చాటింగ్ సెషన్ లో రాశి వెనకేసుకొచ్చింది. కొందరికి మాత్రమే ధర్మ కథానాయికగా ఛాన్సుంటుందని నేను అనుకున్నాను. బయటి నుంచి వచ్చేవాళ్లు ఇలాంటి సినిమాలను తీయడం అంత ఈజీ అని అనుకోలేను. కాబట్టి నేను ఈ చిత్రంలో ఉన్నాను అనే వాస్తవం డోర్స్ తెరుస్తుంది.