హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మించారు. ‘ది రివోల్ట్’ అనేది సినిమా ట్యాగ్ లైన్. సుధీర్ బాబు బర్త్ డే కానుకగా విడుదలైన ‘హరోం హర’ ఫస్ట్ ట్రిగ్గర్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ తాజాగా ఊడిపిలో ప్రారంభమైంది. 30 రోజుల పాటు జరిగే ఈ లాంగ్ షెడ్యూల్‌లో ఊడిపి పరిసరాల్లోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తూ, రవితేజ గిరిజాల ఎడిటర్ గా పని చేస్తున్నారు .