ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రముఖ సినీ నటుడు మహర్షి రాఘవ రికార్డు స్థాయిలో 97 సార్లు రక్తదానం చేశారు. శనివారం చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ లో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న మహర్షి రాఘవ రక్తదానం చేశారు. 1998 నుంచి ప్రతి మూడు నెలలకోసారి రక్తదానంను నటుడు రాఘవ చేస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అత్యధిక సార్లు రక్తదానం చేసిన రాఘవ అందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మహర్షి రాఘవకు ఆయురారోగ్యాలు కలుగజేయాలని, భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చిరంజీవి తరపున బ్లడ్ బ్యాంక్ నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు.