శ్రీమతి కాండ్రగుల లావణ్య రాణి సమర్పణలో సినిమా బండి ప్రొడక్షన్స్ (సినిమా బండి ప్రొడక్షన్స్) పతాకంపై శ్రీకాంత్ గుర్రం మరియు ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటించిన చిత్రం “తంతిరం”. ముత్యాల దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల (SK) నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. అయితే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ కాండ్రగుల మాట్లాడుతూ “మా తంతిరం చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇది హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రం. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మా “తంతిరం” చిత్రం చూడాల్సిందే. మా చిత్రం కేరళ ప్రాంతాలలో అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్నాము, షూటింగ్ అంతా పూర్తయింది. ప్రస్తుతానికి నిర్మాణాంతర పనుల్లో బిజీ గా ఉంది. ఈ రోజు మా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసాము. త్వరలోనే టీజర్, ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం” అని అన్నారు.
చిత్రం పేరు : తంతిరం
నటీనటులు : శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ఎలందూర్, నిర్వహించారు
బ్యానర్ : సినిమా బండి ప్రొడక్షన్స్
కథ : షాబాజ్ ఏం ఎస్ , వినీత్ పొన్నూరు
కెమెరా మాన్ మరియు ఎడిటర్ : వంశీ శ్రీనివాస్ ఎస్
సంగీతం : అజయ్ ఆరాసాడ
లిరిక్స్ : భాస్కరభట్ల
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)
దర్శకుడు : ముత్యాల మెహర్ దీపక్
నిర్మాత : శ్రీకాంత్ కాండ్రగుల (SK)