మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పంచుకున్నారు. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… ఎండవేడిమిని తట్టుకోలేని ఓ పిల్ల ఏనుగుకు పైపుతో నీళ్లు పడుతూ వేసవి తాపం తీర్చడాన్ని చూడొచ్చు. కుటుంబ సమేతంగా తాము ఓ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించామని ఉపాసన ప్రకటించింది. థాంక్యూ మిస్టర్ సి… అద్భుతమైన అనుభవాన్ని అందించారు… ఈ ఏనుగుల రెస్క్యూ క్యాంప్‌లో ఎంతో నేర్చుకున్నాం అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఫొటోలో క్లీంకార గుండుతో తిరిగింది. అమ్మ ఉపాసన చంకనెక్కిన క్లీంకార… నాన్న రామ్ చరణ్ చేస్తున్న పనిని ఆసక్తిగా గమనిస్తూనే ఉంది.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ రావడంతో కుటుంబ సమేతంగా రామ్ చరణ్ థాయ్ లాండ్ వెళ్లారు. బ్యాంకాక్‌లోని ఓ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఉపాసన పైవిధంగా స్పందించారు.