జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు సందర్భంగా మే 20న ‘దేవర’ (దేవర) మొదటి సాంగ్ విడుదల కానుందని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఒకరోజు ముందుగానే అంటే మే 19నే ఫస్ట్ సాంగ్ ని విడుదల చేసి విడుదల చేసింది సర్ ప్రైజ్ దేవర టీం. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరింత కిక్కిస్తున్నాయి.
ఎన్టీఆర్ కి, నాగవంశీకి మధ్య మంచి అనుబంధముంది. ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్ కి ఇన్వైట్ చేయడం కోసం.. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో కలిసి ఎన్టీఆర్ నివాసానికి వంశీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ ‘దేవర’ సాంగ్స్ వినిపించినట్లు చెప్పి.. ఆ ముగ్గురూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఇప్పుడు దేవర ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా.. నాగవంశీ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే కామెంట్స్ చేశాడు.
“దేవర నుంచి విడుదలవుతున్న ఫియర్ సాంగ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ యాంతం” అని నాగవంశీ అన్నాడు. “మీ అందరి కంటే ముందు నేను పాట విన్నాను.. ట్రస్ట్ మీ.. హుకుం(జైలర్ సాంగ్) మర్చిపోతారు.. ఇది అనిరుధ్ నెక్స్ట్ లెవెల్ మాస్ సాంగ్.” అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు “దేవర ముంగిట నువ్వెంత” అనే లైన్ ని కూడా జోడించాడు.
అసలే ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇప్పుడు నాగవంశీ చేసిన కామెంట్స్ తో అంచనాలు మరోస్థాయికి వెళ్లాయి.
మే 19న ‘దేవర’ నుంచి ఫియర్ సాంగ్ విడుదల. మే 18న ప్రోమో విడుదలయ్యే అవకాశం ఉంది.