మే 20 డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటి. ఈ మాట ఎవరినైనా అడిగితే కొంచం ఆలోచిస్తారేమో గాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అసలు ఆలోచించరు. ఎందుకంటే ఆ రోజు వాళ్ల సెమి గాడ్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. రెండున్నర దశాబ్దాల నుంచి తన అద్భుతమైన నటనతో, డాన్స్ తో అభిమానుల గుండెల్లో గాడ్ గా కొలువుతీరాడు. ఈ పుట్టిన రోజు తన అభిమానుల్లో మరుపురాని గుర్తుగా ఉండబోతుంది
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 చిత్రాలతో ఉన్నాడు. రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ రెండిటి తర్వాత ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతున్నాడు. ఆ కాంబో మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ మూవీకి డ్రాగన్ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న టైటిల్ ని అధికారకంగా ప్రకటించబోతున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు డ్రాగన్ వార్త సోషల్ మీడియాలో వస్తుంది ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా టైటిల్ ఉందని అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో డ్రాగన్ ఇండియన్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటూ పోస్ట్ లు పెడుతున్నారు
పైగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా ఏంటంటే పుట్టినరోజుకి వన్ డే బి ఫోరే దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడుతు దేవర సాంగ్ రిలీజ్ అయ్యాక రజనీకాంత్ రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్‌లోని టైగర్ కా హుకుం పాటని అందరు మర్చిపోతారంటూ చెప్పారు.దీంతో ఫ్యాన్స్ రెండు రోజుల పాటు ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలను మూడ్ తో ముడ్చుకొస్తున్నారు.