అలీతో సరదాగా ఈవారం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లయ వచ్చింది. ఆలీ, లయ కలిసి స్వయంవరం మూవీలోని సాంగ్ కి స్టెప్స్ కూడా వేశారు. ఈ సాంగ్ తర్వాత ”ఇప్పుడు వచ్చిన ఈ పాటలు మీ అమ్మవి. లయగారు వచ్చారా ?” అని లయనేతూ కాసేపు ఫన్ చేసాడు అడుగు ఆలీ. దానికి నవ్వుతూ ”నేనే లయ” అని సమాధానమిచ్చింది. అది విన్న ఆలీ షాకయ్యాడు. ”నేను శ్లోక అనుకున్నారా” అని నవ్వేసింది లయ. ‘స్వయంవరం’ మూవీ వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లయకు కంగ్రాట్స్ చెప్పాడు ఆలీ. లయ కూడా తిరిగి ఆలీకి కంగ్రాట్స్ చెప్పారు.
లయ పర్సనల్ లైఫ్ గురించి అడిగారు. ”లయ చాలా ఇబ్బందుల్లో ఉంది. అమెరికాలో రోడ్లపై ఉంటోంది అంటే కామెంట్స్ విన్నప్పుడు ఎలా అనిపించింది” అని ఆడిగాడు ఆలీ. ”ఎందుకు ఇదంతా. ఇలాంటివి వినేటప్పుడు చాలా బాధేస్తుంది. అడుక్కు తింటున్నాను అంటే కాదు ఇంకా చాలా చేస్తున్నానని కూడా అన్నారు. అవన్నీ తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంది” అని పాపం ఫీలయ్యింది లయ. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ “2005లో మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఆంటీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అని నన్ను అడిగారు. ఇప్పుడు కాదు అని చెప్పడంతో మా ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదనుకున్నారు” అంటూ తమ పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నటిస్తున్న తమ్ముడు మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాను” అని ఆ తర్వాత తను, ఆలీ కలిసి నటించిన సినిమాలను గుర్తుచేసుకున్నారు.