ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం ఖచ్చితంగా వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఆ టైం వచ్చిన వాళ్లకి టైం ఉండదు. పట్టు మని పది నిముషాలు కూడా ఊపిరిపీల్చుకోలేనంత ప్రస్తుతం ఉంటారు.ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ రష్మిక పరిస్థితి ఇదే. షూటింగ్ నిమిత్తం ముంబై టూ హైదరాబాద్ తిరుగుతుంది. ఇంత బిజీలో కూడా మూవీకి సంబంధం లేదని వీడియో ఒకటి చేసింది. ప్రధానమంత్రి మోదీ నుంచి ప్రశంసలు అందుకుంది
ముంబై లోని సముద్ర తీరం మీద మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం అటల్ సేతు పేరుతో ఒక భారీ వంతెనను నిర్మించింది. ఇది దేశంలోనే అతి పెద్ద మూడవ బ్రిడ్జ్ కూడా. రెండు గంటల ప్రయాణాన్ని కేవలం ఇరవై నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. రీసెంట్ గా అటల్ సేతు మీద ప్రయాణం చేస్తు రష్మిక ఒక వీడియో చేసింది. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు అందరి హృదయాలు కలుపుకుంటూ వెళ్లాలంటూ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పుడు ఆ వీడియోకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి రిప్లై వచ్చింది. ఖచ్చితంగా మనుషుల్ని కలుపుకుంటూ వెళుతూ వారి జీవితాలను మెరుగు పరచడం కంటే ఏది సంతృప్తి ఇవ్వదు అంటూ చెప్పారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. 12 గంటల్లోపే 90 వేలకు పైగా లైక్స్ ని కూడా ఉన్నాయి.
ఇక రష్మిక ఇటీవల యానిమల్ తో భారీ విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. పుష్ప 2 , గర్ల్ ఫ్రెండ్,కుబేర లు షూటింగ్ దశలో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ నూతన చిత్రం సికిందర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.