మూవీ : విద్య వాసుల అహం
నటీనటులు: శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస రెడ్డి
రచన : వెంకటేశ్ రౌతు
ఎడిటింగ్: సత్య గిడుతూరి
సంగీతం: కళ్యాణి మాలిక్
సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి
నిర్మాతలు: నవ్య మహేశ్, రంజిత్ కుమార్
దర్శకత్వం: మణికాంత్ గెల్లి
ఓటీటీ: ఆహా
కథ:
విద్య(శివాని రాజశేఖర్) ఓ మధ్యతరగతి అమ్మాయి. తనకి కాబోయే భర్త గురించి ఎన్నో కలలు కంటుంది. వాసు(రాహుల్ విజయ్) కూడా మధ్యతరగతి అబ్బాయి. మెకానిల్ ఇంజనీర్ గా వాసు జాబ్ చేస్తుంటాడు. అయితే అదే సమయంలో శాస్త్రి వాసుకి, విద్యకి పెళ్లిచూపులు ఫిక్స్ చేశారు. ఇక ఇద్దరు ఒకే అనేసరికి పెళ్లి జరుగుతుంది. వీళ్ళిద్దరు అనుకున్నట్లుగానే పెళ్లి తర్వాత వేరు కాపురం పెడతారు. ఇక కొన్నిరోజులకి విద్యకి కొత్త జాబ్ వస్తుంది. పెళ్లి తర్వాత అవుతా హనీమూన్ కి వెళ్ళాడు వాసు డిసప్పాయింట్. కొన్నిరోజులకి వాసుకి తన బాస్ ఇంక్రిమెంట్ తక్కువ ఇచ్చాడని జాబ్ కి రిజైన్ చేసాడు. ఇక ఇంటిపట్టునే ఉంటూ సీరియల్స్ చూస్తూ కాలం సాగిస్తుంటాడు. కొన్నిరోజులకి వాసు ప్రతీ చిన్న అవసరానికి తన భార్యని అడుగలేక అహం అడ్డొస్తుంటుంది. ఇక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని వాసు మీద విద్య కోప్పడుతుంది. అలా మధ్య రోజు రోజుకి గొడవలు పెరుగుతాయి. ఇక అదేసమయంలో వారింటికి ఇద్దరి పేరెంట్స్ వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది. విద్య-వాసులలో ఎవరి అహం గెలిచింది? ఇద్దరు అన్యోన్యంగా ఉండగలిగారా? ఇద్దరిలో ఎవరు కాంప్రమైజ్ అయ్యారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ:
కొత్తగా పెళ్ళైన జంట మధ్యలో చిన్న చిన్న గొడవలు జరగడం కామన్. అలా గొడవ జరిగినప్పుడు ఒకరు కాకపోతే మరొకరు కాంప్రమైజ్ అవ్వాలి.. కానీ ఇద్దరికి అహం ఉంటే ఎలా? అనే చిన్న పాయింట్ తో దర్శకుడు మణికాంత్ గెల్లి ఈ మూవీని తీసుకొచ్చాడు. దీనిని ప్రేక్షకులు మెప్పు పొందేలా ప్రదర్శించడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే దర్శకుడు సినిమాలో భార్యభర్తల మధ్య జరిగే గొడవలు.. ఇగో మీద ఎక్కువ శ్రద్ధ చూపించాడు. కానీ ప్రేక్షకుడికి ఎంటర్‌టైన్‌మెంట్ అందించి మరచిపోయాడు. , ఇగో అనే అంశాల చుట్టూ కథ సాగడం వరకు ఒకే కానీ.. దానికి అదిరిపోయే కామెడీ కూడా తోడయినట్లైతే అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.
‘మద్యం మద్యాహ్నం అలవాటు లేదు’ వంటి కొన్ని డైలాగ్ లు బాగానే పేలాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే బ్యాండింగ్ ని, ఎమోషన్స్ ని పతాక సన్నివేశాల్లో బాగా చూపించారు. సినిమా అంతా కూడా అదే టెంపో మెయింటైన్ అయితే ఇంకా బాగుండేది. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ మీద, ఫ్యాన్ డైలాగ్స్ మీద మరింత ఫోకస్ పెట్టాల్సింది. నిడివి తక్కువ కావడం ఈ సినిమాకి ప్రధాన బలం. తెలియకుండానే సినిమా త్వరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు. ఒక ఐదు నిమిషాల పాటు సాగే సాంగ్ కాస్త రొమాంటిక్ ఉంటుంది. మిగిలినదంతా ఓకే. అసభ్య పదజాలం ఎక్కడా వాడలేదు. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ బాగుంది. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సత్య గిడుతూరి ఎడిటింగ్ లో కాస్త శ్రద్ధ చూపించింది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందోనని జగపతిబాబు, ప్రియమణి ఎప్పుడో చూపించారు. కాన్సెప్ట్ తో ఇలాంటి పలు సినిమాలు వచ్చాయి. అయితే ఇది ఈ తరానికి తగ్గట్టుగా కాస్త కొత్తగా ఉంది.
నటీనటుల పనితీరు:
శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ఇద్దరు పోటీపడి నటించారు. అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస రెడ్డి, అభినయ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఫైనల్ గా : వన్ టైం వాచెబుల్.
రేటింగ్: 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్