సీరియల్ నటుడు చందు నిన్న హైదరాబాద్ లో ఆత్మ హత్య చేసుకొని చనిపోయాడు. త్రినయని సీరియల్ నటి పవిత్ర మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చందు భార్య చెప్పిన మాటలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి
చందు భార్య పేరు శిల్ప. 2015లో వారికి వివాహం జరిగింది. స్కూల్ డేస్ నుంచే వాళ్ళ మధ్య ప్రేమ మొదలయ్యింది. మొదట చందునే శిల్ప ని ప్రేమించమని వెంటపడ్డాడు. ఆ తర్వాత శిల్పం కూడా చందు ప్రేమకి ఓకే చెప్పింది. అలా 12 సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరకీ ఒక బాబు పాప కూడా ఉన్నారు. కొన్నాళ్ల వరకు చక్కగానే సాగిన వాళ్ల కాపురంలో చనిపోయిన పవిత్ర రాకతో కలతలు మొదలయ్యాయి. ఫలితంగా నాలుగు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య మాటలు లేవు. కేవలం పిల్లలతోనే కాంటాక్ట్ లో ఉండే వాడు. కానీ ఏ రోజుకైనా మారి తన దగ్గరకి వస్తాడు అని శిల్ప అనుకుంది. చనిపోయే ముందు కూడా చందు కి ఫోన్ చేసి మాట్లాడింది. ఇంటికి రమ్మని బతిమాలింది కూడా. ఇప్పుడు శిల్పం చెప్పిన ఈ మాటలన్నీ హాట్ టాపిక్ గా నిలిచాయి
కార్తీక దీపం, రాధమ్మ పెళ్లి, త్రినయని లాంటి సీరియల్స్ చందుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ప్రముఖ సినీ, టీవీ నటి కరాటే కళ్యాణి తనకి చందు కి మధ్య జరిగిన వాట్స్ అప్ చాట్ ని బయటపెట్టింది.నాకు ఇంక ఈ జన్మ చాలు. నేను చనిపోవడమే కరెక్ట్ అనే చందు మెసేజ్ ఉంది