నటన కోసమే పుట్టిన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నూనూగు మీసాల వయసులోనే బూజు పట్టిన ఇండస్ట్రీ రికార్డు లన్నింటికీ విముక్తి కలిపి సరికొత్త రికార్డులని సృష్టించాడు. అందుకే ఆయన్ని మాన్ ఆఫ్ మాసెస్ అని పిలుస్తారు. ఆన్ ది స్క్రీన్ శత్రువులకి చెమటలు పట్టించే ఎన్టీఆర్ ఆఫ్ ది స్క్రీన్ ఎంతో దయా హృదయంతో ఉంటాడు. ఈ విషయం చాలాసార్లు నిరూపితమయ్యింది. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది
గత సంవత్సరం మే 20 న ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ సింహాద్రి రీ రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలైన కలెక్షన్స్ ల సునామిని సృష్టించింది. 2003 లో మూవీని చూడటానికి అవకాశం లేని వాళ్ళు రీ రిలీజ్ లో సిల్వర్ స్క్రీన్ మీద ఎన్టీఆర్ నటనకి, డాన్స్ కి ఫైట్స్ కి ఫిదా అయ్యారు. ఇక ఆ సమయంలో వచ్చిన అమౌంట్ ని అభిమానులు పేదవాళ్ళకి అందచేశారు. ఎన్టీఆర్ ప్రకారం అమౌంట్ ని ఇస్తున్నామని చెప్పారు . ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పేద వారు ఆ అమౌంట్ ని అందుకున్నారు. ఈ ఎన్టీఆర్ కి ఆయన అభిమానులకి సమాజం పట్ల ఉన్న ప్రేమ ఏ పాటిదో మరోసారి అర్ధమయ్యింది.అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో జరిగిన సంఘటనతో దాన్ని చూసిన వాళ్ళందరు ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ ని పొగుడుతో కామెంట్స్ చేస్తున్నారు
ఇక ఎన్టీఆర్ బర్త్ డే కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఆ సెలబ్రేషన్ ని ఘనంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్ని దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు జరగబోతున్నాయి. మే 20న ఆయన బర్త్ డే డేట్..అలాగే రేపు దేవర నుంచి సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ప్రెజంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ నడుస్తుంది. రేపాటి నుంచి అంటే మే 19 నుంచి అక్టోబర్ 10 వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఉంటారని. అక్టోబర్ 10 న దేవర విడుదల కాబోతుంది