నటీనటులు: యువ రాజ్ కుమార్, సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, సుధారాణి, హిత చంద్రశేఖర్, గోపాల్ కృష్ణ దేశ్ పాండే నిర్వహించారు
ఎడిటింగ్: ఆశిష్ కుసుగొల్లి
మ్యూజిక్: బి. అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్రఫీ: శ్రీషా కుడువల్లి
నిర్మాతలు: విజయ్ కిరగందూర్
రచన, దర్శకత్వం: సంతోష్ ఆనంద్ రామ్
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో
కథ:
ఓ ఇంజనీరింగ్ కాలేజీలో యువ(యువ రాజ్ కుమార్) ఫైనల్ ఇయర్ చదువుతుంటాడు. అదే కాలేజీలో చదువుతున్న సిరి(సప్తమి గౌడ), యువ ప్రేమించుకుంటారు. వీళ్ళు చదివే కాలేజీలో రెండు గ్యాంగ్ ల మధ్య నిత్యం గొడవలు జరుగుతుంటాయి. అయితే అందులో ఈ గ్యాంగ్ ల వెనక పెద్ద పెద్దోళ్ళు ఉండటంతో కాలేజీ యాజమాన్యం కూడా వారిపై ఏ యాక్షన్ తీసుకోలేకపోతుంది. దాంతో యువ వారికి ఎదురెళ్తాడు. అయితే యువ ఓ రెజ్లర్. రెజ్లింగ్ లో అతని కోచ్ నేరం చేశాడని, గేమ్ గెలిచేందుకు తప్పు చేశాడని ఆధారాలు దొరుకుతాయి. దాంతో యువని రెజ్లింగ్ కాంపిటీషన్ తీస్తారు. అతనిపై రెండు సంవత్సరాలు నిషేధం విధిస్తారు. ఎదురుగా వాళ్ళ నాన్న శంకర్ (అచ్యుత్ కుమార్) అప్పులు చేశాడు. యువ వాళ్ళ నాన్న శంకర్.. తన కూతురు శ్వేత వివాహాన్ని అప్పులు చేసి జరిపిస్తాడు. ఆ తర్వాత అప్పులిచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి గొడవలు చేస్తుంటే భరించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. యువ కాలేజీ గొడవల్లో ఉంటూ వాళ్ళ నాన్న కోసం ఎదురుచూస్తుంటాడు. యువ రెజ్లింగ్ లో పాల్గొన్నాడా? అతని నాన్న కల నెరవేర్చాడా? కాలేజీల్లో యువ లైఫ్ ఎలా మారిపోయిందనేది మిగిలిన కథ..
విశ్లేషణ:
ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే గొడవలతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. యువ చుట్టూ సాగే కథాంశం కావడంతో అతడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు. రెజ్లింగ్ కాంపిటీషన్, కాలేజీలో రెండు గ్యాంగ్ ల మధ్య తరచూ జరిగే గొడవ.. మధ్యలో హీరోహీరోయిన్ మధ్య లవ్ ట్రాక్.. పాటలు అంతే. ఇంతకు మించిన కథ ఏంటని దర్శకుడు అనుకున్నాడు.. అందుకే తెలుగు ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు.
మన తెలుగు సినిమాలలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. మనం ఈ యువ చూస్తుంటే.. జగడం, జోష్ మూవీలు రెండు కలిపి చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే యూత్ ని ఆకట్టుకోవడానికి కాలేజీని ఎంచుకున్నట్టుగా.. మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సీన్లని రాసుకున్నట్టుగా ఉంటుంది. ఇక అందరు అమ్మ సెంటిమెంట్, చెల్లి లేదా అక్క సెంటిమెంట్ వాడుకుంటే దర్శకుడు సంతోష్ ఆనంద్ రామ్.. నాన్న సెంటిమెంట్ ని వాడుకున్నాడు. ఇక సప్తమి గౌడతో సాగే లవ్ జర్నీ పెద్దగా కనెక్ట్ కాలేదు. ఏదో ఉందా అంటే ఉందా అని అనుకుంటే ఆమె పాత్ర ఉంటుంది. భీమిలి కబడ్డీ జట్టులో కోచ్ కిషోర్ కుమార్ ని చూసి.. ఈ సినిమాలో యువకి రెజ్లింగ్ కోచ్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది.
సినిమా మొత్తం కాలేజీ ఫైట్స్.. నాన్న కోసం హీరో వెతకడం.. రెజ్లింగ్ పోటీ అంటూ లాగుతూ లాగుతూ చివరి పది నిమిషాల్లో ఆ పోటీ పెట్టారు. దర్శకుడు సంతోష్ ఆనంద్ రామ్ మన తెలుగు సినిమాలన్నింటిని చూసి ఇన్ స్పైర్ అయినట్టుగానే ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కాస్త వర్కవుట్ అయ్యాయి. హాస్యం పూర్తిగా లోపించింది. సినిమా మొత్తం హీరో ఓ సీరియస్ ఎమోషన్ ని క్యారీ చేస్తాడు. వీడోసారి నవ్వితే చూడాలని ఉందిరా అని అన్నట్టుగా హీరో క్యారెక్టర్ ఉంటుంది.
ఇంజనీరింగ్ పూర్తి చేసిన హీరో ఫుడ్ డెలివరీ గా చేస్తూ.. ఓవైపు గొడవలు.. మరోవైపు ఫ్యామిలీని చూసుకోవడం.. ఇలా అన్నింటిని తనొక్కడే చేసుకోవడంతో సినిమా మొత్తం బాయ్ కన్పిస్తుంటాడు. అడాల్ట్ సీన్లు ఏమీ లేవు. ఆశిష్ ఎడిటింగ్ బాగుంది. అజనీష్ సంగీతం పర్వాలేదు. శ్రీషా సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
యువ రాజ్ కుమార్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. కాదు సినిమా మొత్తం అతనే కనిపించాడు. సిరిగా సప్తమి గౌడ, శంకర్ గా అచ్యుత్ కుమార్, గిరిజగా సుధారాణి ఆకట్టుకున్నారు. మిగిలినవారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా..
కాలక్షేపం కోసం ఓసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2.25/5
✍️. దాసరి మల్లేశ్